Saturday, July 25, 2009

चाँद कबी गड़ता थो कबी बदता है उस यहाँ बीमारी है
इसी तरह हम भी आगे बढ़ाना है

Thursday, July 16, 2009

ఊటీ విహార యాత్ర


నేను, నా భార్య ఉమ, మా పాప మధూలిక మా ఇద్దరి అన్నయ్యల కుటుంబం, అక్క, బావ తో మోత్తం పదకొండు మంది మే, రెండు వేల ఎనిమదో సవత్సరము లో ఊటీ వెళ్ళాము. నెల్లూరు నుండి శబరి ఎక్ష్ప్రెస్స్ లో కోయంబత్తూర్ వరకు వెళ్ళాము. స్టేషన్ కి దగ్గరలోని ఒక హోటల్ లో రూమ్స్ తీసుకున్నాము. భోజనం మరియు టిఫిన్స్ చాల ఖరీదు గా ఉన్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి ఇరవై కి.మీ. దూరం లో ఉన్న ఇషా ధ్యాన మందిర్ చూసి వచ్చాము. అందులో స్పటిక శివలింగం ఒక కొలను లో ఉంచి అందులో స్నానం చేస్తే మంచిది అని చెప్తున్నారు. టికెట్ మనిషికి పది రూపాయలు. ధ్యాన మందిరం లో పెద్ద శివ లింగం ఉంది. అక్కడ చాల మంది ధ్యానం చేస్తున్నారు. మేము కూడా కొద్ది సేపు చేసాము. చాలా రిలీఫ్ గా అనిపించింది.
కోయంబత్తూర్ నుండి ఊటీ వెళ్ళడానికి అక్కడ లోకల్ గా తిరగడానికి ఒక స్వరాజ్ మజ్దా వెహికల్ మాట్లాడుకున్నాము. తెల్లవారితే ఊటీ వెళతాం అనే ఆలోచనతో అననదంగా అందరం రాత్రి పదకొండు గంటలకు నిద్ర పోయాము.ఉదయం ఏడు గంటలకు బయలుదేరాలనుకున్నాము. తెల్లవారు ఝామున ఐదు గంటల నుండి పెద్ద వర్షం మొదలైంది. చలి, కారు మేఘాలు మేము అప్పుడే ఊటీ లో ఉన్నట్లుగా అనిపించింది.
కోయంబత్తూర్ నుండి ఊటీ కి ౧౪౦ కి.మీ. దూరం. ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి పన్నెండున్నర గంటలకు ఊటీ లో తమిళనాడు టూరిజం గెస్ట్ హౌస్ కి చేరుకున్నాము. ముందుగానే ఎనిమిది బెడ్స్ ఉండే రూమ్స్ రెండు రిజర్వు చేసుకున్నాము. ఒక రోజు కి రూం రెంట్ రూ.౧౧౫౦/-. రూమ్స్ పరవాలేదనిపించింది.
ఊటీ లో చూడతగిన ప్రదేశాలు - బొటానికల్ గార్డెన్స్, బోటింగ్ పాయింట్, రోజ్ గార్డెన్స్, దొడ్డపెట్ట, పయ్కర వాటర్ ఫాల్స్ .
పడవలో షికారు అందరు ఎంజాయ్ చేస్తారు. గుర్రం మీద ఎక్కించి తిప్పుతారు. పిల్లలు బాగా ఇష్టపడతారు. అన్నిటికి విడివిడిగా టికెట్స్ ఉంటాయి. తిరుగు ప్రయాణం లో కూర్గ్ వరకు హిల్ ట్రైన్ లో వచ్చాము. అక్కడ కూడా పెద్ద గార్డెన్ ఉంది. తప్పక చూడవలసిందే. అక్కడనుండి కోయంబత్తూర్ కి వెహికల్ లో వచ్చి రాత్రి ౯.౩౦ కి రైలు బండి ఎక్కాము. శ్రీపురం లో గోల్డెన్ టెంపుల్ చూసాము. చాల అధ్బుతంగా ఉంది. శ్రీపురం

Monday, July 13, 2009

మైసూరు విహార యాత్ర





నెల్లూరు నుండి మైసూరు టూర్ . నేను, నా భార్య - ఉమ, మా పాప మధులిక మరియు మా అన్నయ్య కుటుంబం (మొత్తం తొమ్మిది మంది ) కలిసి ఏప్రిల్ ౩ వ వారం లో మైసూరు పాలస్ , బృందావన్ గార్డెన్స్ చూడాలని బయలుదేరాము.
నెల్లూరు నుండి ప్రతి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మైసూరు కు డైరెక్ట్ ట్రైన్ ఉంది. అది మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు చేరింది. ఆ రోజు బి ఎస్ ఎన్ ఎల్ ఐ క్యూ కి వెళ్ళాము. కాంటీన్ లో భోజనం చేసాక మధ్యాహ్నం ౩ గంటలకు బయలుదేరి మహారాజా పాలస్ చూడటానికి వెళ్ళాము. సాయంత్రము ఐదు గంటలవరకు టికెట్స్ ఇస్తారు. ఆరు గంటలకు క్లోజ్ చేస్తారు. ఆదివారము రాత్రి ఏడు గంటలకు పాలస్ మొత్తం దీపాలు వేస్తారు. అపుడు చాలా బాగుంటుంది.
మేము అందరము చాలా ఆనందం గా గడిపాము. పిల్లలు బాగా ఆడుకున్నారు.
మరుసటి రోజు ఒక టాటా సూమో మాట్లాడుకుని లోకల్ గా ఉన్నచాల ప్లేసెస్ చూసాము. వాటిలో ముఖ్యమైనవి జూ, బృందావన్ గార్డెన్స్, మ్యూజియం, చర్చి, చాముండి హిల్స్, పెద్ద నంది, టిప్పు పాలస్ అన్ని కూడా తప్పక చూడవలిసిన ప్రదేశాలు.
ఆ తర్వాత రోజు అదే బండి లో శ్రావణ బెలగోళ, హళిబేడు, బేలూరు చూసి వచ్చాము. అక్కడి శిల్ప సంపద, వాటి అందము చూడవలసిందే కానీ మాటలలో చెప్పలేము. కే ఎస్ ఆర్ టి సి టూరిజం బస్ లు ఉన్నాయి
మైసూరు నుండి ఊటీ దగ్గరే. కాని ఇంతకుముందే చూడటం వలన ఈ సారి వెళ్ళలేదు. మైసూరు లో వాతావరణం చాలా బాగుంది. రాత్రి అయ్యేసరికి చాలా చల్లగా అయ్యేది. ఊరు చాలా అందంగా, పూల చెట్లు, పెద్ద పెద్ద చెట్లు తో, విశాలమైన రోడ్ల తో ఉంది. వారం రోజులైనా హయిగా గడపాలనిపించింది.
మైసూరు నుండి లోకల్ ట్రిప్ కి కే ఎస్ ఆర్ టి సి టూరిజం బస్ లు ఉన్నాయి.